- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కట్టడిలో ఉద్యోగుల సేవలు భేష్: ఎర్రబెల్లి
దిశ, వరంగల్: కరోనా కట్టడిలో పోలీసులు, వైద్యులు, రెవెన్యూ ఉద్యోగులు అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. ములుగు జిల్లా కేంద్రంలో పోలీస్ కమిషనర్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లను మంత్రి సోమవారం సన్మానించారు. అనంతరం పండ్లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ముందుచూపుతో సీఎం కేసీఆర్ తీసుకున్న నియంత్రణా చర్యల వల్ల రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోగలిగామన్నారు. రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా అధికారులు ఎనలేని కృషి చేశారని అభినందించారు. త్వరలోనే కరోనా ఫ్రీ జిల్లాగా ఉమ్మడి వరంగల్ నిలవబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతటి ఆర్థిక సంక్షోభంలోనూ పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలకు, ప్రజలను చైతన్య పరిచి కరోనా వైరస్ నివారణలో కీలకపాత్ర పోషిస్తున్న మీడియాకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
Tags : Minister Dayakar Rao, Collector, Municipal Commissioner, Police Commissioner, Honored, corona virus