పేదలను ఆదుకొనేందుకు దాతలు ముందుకు రావాలి

by Shyam |   ( Updated:2020-04-08 04:07:30.0  )
పేదలను ఆదుకొనేందుకు దాతలు ముందుకు రావాలి
X

దిశ, మేడ్చల్: రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా నిరుపేదలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకునేందుకు దాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్ మండలంలోని డబిల్‌పూర్ గ్రామంలో 500 మందికి మల్కాజిగిరి టీఆర్ఎస్ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయన్నారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలెందరో ఆకలితో ఆలమటిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా దాతలు ముందుకొచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయేందర్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ గీతా భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: corona, lockdown, minister malla reddy, come and donate funds

Advertisement

Next Story

Most Viewed