- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సత్వరమే పరిశీలించి… సహాయక చర్యల్లో పాల్గొనండి
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని శ్రీశైలం జెన్ కో పవర్ హౌస్‌లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రమాద ఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సహాయక చర్యల్లో పాల్గొనాలని, స్థానిక అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల యంత్రాంగం ఏ అవసరమైనా సత్వరమే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు.
అర్ధరాత్రి ప్రమాదం జరిగినప్పటి నుంచి అన్ని రకాల సహాయం అందిస్తున్నామని, ఈ ఉదయం కూడా అంబులెన్స్, డాక్టర్లు, క్రేన్, సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్నామని ఆర్థిక మంత్రికి ఏపీ జెన్ కో సీఈ నరసింహా రావు వివరించారు.
మంత్రి ప్రమాదం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, ఆర్థర్, కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులు దోమలపెంటకు చేరుకుని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో తమ రాష్ట్ర సిబ్బంది సైతం పాల్గొంటారని తెలిపారు.