- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాష్ట్రంలోకి చంద్రబాబు దొంగలను వదిలారు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విద్యుత్ శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలన్నీ ప్రజల కోసమేనని తెలిపారు. అవినీతి రహిత, పారదర్శక పాలనను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారని వెల్లడించారు. అంతేగాకుండా చంద్రబాబు రాష్ట్రం పైకి దొంగలను వదిలాడని, వీళ్లు దేవుడి విగ్రహాలను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని బాలినేని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందన్న భయంతో ఏదో ఒకటి చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. టీడీపీ నేతలంతా వైసీపీలోకి వస్తుండడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని.. అందుకే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాడని మంత్రి విమర్శించారు. అంతేగాకుండా కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంటే, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్లు జారీ చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని బాలినేని అన్నారు.