టీడీపీ బ్రతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే.. ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్

by srinivas |
టీడీపీ బ్రతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే.. ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ :తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఇటీవల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాలకు ఇది సమయం, సందర్భం కాదని, దాని గురించి తర్వాత మాట్లాడనంటూ ఎన్టీఆర్ కామెంట్ చేశాడు. ఎన్టీఆర్‌ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటే.. అలా వ్యాఖ్యానించేవాడు కాదని, వచ్చేది అయితే నేరుగా చెప్పేవాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ వల్ల ఎలాంటి లాభం లేదని, టీడీపీ ఉనికిలో ఉండాలంటే ఎన్టీఆర్ రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ నిలబడుతుందన్నారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో టీడీపీ క్లోజ్ అయిందని, వచ్చే ఎన్నికలలోపు ఎన్టీఆర్ రాకపోతే టీడీపీ బ్రతకడం కష్టమని బాలినేని వ్యాఖ్యానించారు. ఏకంగా ఏపీ మంత్రి ఎన్టీఆర్ వస్తేనే, టీడీపీ నిలబడుతుందని చెప్పడంతో.. ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed