- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్ని గ్రామాల్లో ఇళ్ల పంపిణీ : అవంతి
దిశ, విశాఖపట్నం: విశాఖ నగర పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ టిడ్కో ఇళ్లు కేటాయించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం గ్రేటర్ విశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, జోనల్ కమిషనర్లు, హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విశాఖ నగర పరిధిలోని 3.5లక్షల ఇళ్లు దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 2.5లక్షల మందిని అర్హులుగా గుర్తించామని, మిగిలిన లక్షమందికి కూడా వారి అవసరాలను గుర్తించి త్వరితగతిన ఇళ్లు అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ ఆశయం మేరకు అర్హులైన వారందరకీ సకాలంలో ఇళ్లు అందించాలన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చేనెల రెండో తేది వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ పండగ అన్ని గ్రామాల్లో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి,ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, గ్రేటర్ కమిషనర్ డాక్టర్ జి.సృజన, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.