పవన్‌ను టార్గెట్ చేసిన మంత్రి అనిల్.. సినిమా ఖర్చెంత? నీ పారితోషికం ఎంత?

by srinivas |   ( Updated:2021-12-24 03:49:49.0  )
Minister Anil Kumar Yadav
X

దిశ, ఏపీ బ్యూరో : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. పవన్‌ కల్యాణ్‌ తన క్రేజ్‌‌ను క్యాష్‌ చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. సినిమా టికెట్ ధరలపై పవన్ కల్యాణ్‌తోపాటు ఇతరులు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. వకీల్‌సాబ్, భీమ్లా నాయక్‌ సినిమాలకు అయిన ఖర్చెంత? పవన్‌ కల్యాణ్ రెమ్యూనరేషన్‌ ఎంత? అని ప్రశ్నించారు. పవన్‌ రూ.50 కోట్లు కాకుండా రూ.10 కోట్లు తీసుకుంటే ఈ టికెట్‌ ధరలతో నష్టమే ఉండదకదా అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed