- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ బర్త్‌డే స్పెషల్: మొక్కలు నాటిన మంత్రి అల్లోల
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన “ముక్కోటి వృక్షార్చణ” కార్యక్రమంలో భాగంగా లక్ష్మణచాంద గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. మహిళలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ముక్కోటి వృక్షార్చణ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, హరిత తెలంగాణ కోసం తన వంతు కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు.