- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో రైతన్నపై పెను భారం : మంత్రి అల్లోల
దిశ, ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు-2020 రైతులకు, సామాన్య ప్రజలకు శాపంగా మారనుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే విద్యుత్ సవరణ చట్టం పేరుతో ఉచిత కరెంట్‌కు కోత పెట్టేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండటం బాదాకరమన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్ తో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ ముసాయిదా చట్ట రూపం దాలిస్తే దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై పెనుభారం పడనుందని, దీన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రైతులు నెలకు రూ.3వేల నుంచి రూ.4వేల మేర బిల్లుతో పాటు ఒక్కో కొత్త మీటర్ కనెక్షన్‌కు సుమారు రూ. 2 వేల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 6 లక్షల 10 వేల మంది రైతుల రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్ల్లు విడుదల చేసినందుకు.. సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కష్ట కాలంలో కూడా వానకాలం సీజన్‌కు రైతుబంధు కోసం రూ.7,000 కోట్లు మంజూరుచేసిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడమేగాక కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టడంతో ప్రసవాల సంఖ్య పెరుగుతూ వస్తోందన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1060 ప్రసవాలు జరగగా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో 576 జరిగినట్టు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిన విషయాన్ని మంత్రివర్గ సమావేశం సందర్బంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా డాక్టర్లను అభినందించారని మంత్రి తెలిపారు.
Tags: Minister Allola Indrakaran reddy,meeting,central power bill,amendment