‘కొవిడ్ బాధితుల కోసం కోట్లు ఖర్చు’

by srinivas |
‘కొవిడ్ బాధితుల కోసం కోట్లు ఖర్చు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ కొరలు చాస్తోంది. వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతూ వైరస్ విలయతాండవం చేస్తోంది. అటు మహమ్మారికి అడ్డుకట్ట వేసేందకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. పెద్ద మొత్తంలో కరోనా టెస్టులు చేస్తుంది. అలాగే ఆస్పత్రుల సంఖ్యను కూడా పెంచిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే శనివారం కొవిడ్ నివారణపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి ఆళ్లనాని సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కరోనా ప్రభావంపై చర్చించారు. నివారణ కోసం తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా పై పోరుకు నెలకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొవిడ్ ఆస్పత్రులకు 10 వేల డోసులు పంపిస్తున్నామని.. మరో నాలుగు వారాల్లో 90 వేలకు పైగా అందుబాటులో ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed