ఆ యాక్టర్ డేటింగ్‌‌ పేరుతో మోసం చేశాడు : బాలీవుడ్ నటి

by Shyam |
Manisha-Lamba
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి మినీషా లంబా.. రీసెంట్‌ ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్స్ గురించి ఓపెన్ అయింది. బీటౌన్ యాక్టర్‌తో కొంతకాలం రిలేషన్‌లో ఉన్న తను మోసపోయినట్లు తెలిపింది. అంతేకాదు మాజీ బాయ్‌ఫ్రెండ్ అతని ప్రొఫెషన్ కన్నా అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడంలోనే ఆరితేరాడని చెప్పింది. ఇక అతనితో బ్రేకప్ అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరితోనూ డేటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఒక వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు రివీల్ చేసిన మినీషా.. అతని ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు సీక్రెట్‌గా ఉంచుతున్నట్టు పేర్కొంది. కాగా గత అనుభవాల దృష్ట్యా, యాక్టర్స్‌తో డేటింగ్ విషయంలో ఏవైనా రిజర్వేషన్స్ పాటిస్తున్నారా? అని రేడియో హోస్ట్ ప్రశ్నించగా.. అక్కడ ఊహించనంత టెంప్టేషన్ ఉంటుంది గనుకే వారికి దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసింది.

ఇంతకుమించి ఏమీ చెప్పలేనని, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు యాక్టర్స్‌తో డేటింగ్ చేస్తున్నారని తెలిపింది. ఈ విషయం గురించి ఏదైనా కామెంట్ చేస్తే, అది కొంతమందిని హర్ట్ చేయొచ్చని అభిప్రాయపడింది. అయితే ఇది తనకోసం తాను తీసుకున్న నిర్ణయమేనన్న మినీషా.. ఇప్పటికీ బంధాలు కష్టంగా ఉన్నాయనే భావిస్తున్నట్లు చెప్పింది. కాగా తను గతంలో రెస్టారేటర్ ర్యామ్ థామ్‌ను పెళ్లి చేసుకోగా గతేడాది విడాకులిచ్చింది.

Advertisement

Next Story