క్లైమేట్ చేంజ్.. నష్టాలను వివరిస్తున్న ‘మినీ గోల్ఫ్ కోర్ట్’

by vinod kumar |
క్లైమేట్ చేంజ్.. నష్టాలను వివరిస్తున్న ‘మినీ గోల్ఫ్ కోర్ట్’
X

దిశ, ఫీచర్స్ : గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పర్యవసానంగా హీట్ వేవ్స్, వరదలు, హిమానీనదాలు కరగడం వంటి ప్రకృతి విపత్తులను చూస్తూనే ఉన్నాం. క్లైమేట్ చేంజ్ వల్ల సాధారణ పౌరుల నుంచి సముద్ర జీవులు, ధ్రువపు జంతువుల వరకు పెను ముప్పును ఎదుర్కోనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ‘మినీ గోల్ఫ్ కోర్ట్’‌ను ఏర్పాటు చేశారు.

గోల్ఫ్ స్టేడియంలో బాల్‌ను గోల్ పోస్ట్ చేయడానికి హోల్స్ ఉంటాయని తెలిసిందే. బ్రూక్లిన్‌లోని డొమినో పార్క్‌లో ఏర్పాటైన మినీ గోల్ఫ్ కోర్ట్‌లో 18 గోల్‌పోస్ట్‌‌లు ఏర్పాటు చేయగా, ఒక్కో దాని వద్ద వాతావరణ మార్పులు, సవాళ్లు, దాని వల్ల ఏయే జీవులకు నష్టం వాటిల్లుతుంది? తీవ్రమైన వాతావరణ పరిస్థితులను నివారించడానికి సాయపడే మార్గాలను వివరిస్తూ బోర్డులు, బొమ్మలు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు రూపొందించిన ‘మినీ-గోల్ఫ్ వీడియో’ నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించింది.

ఈ కోర్టు హోల్స్‌ను స్థానిక కళాకారులు, ఎన్‌జీవో సంస్థలు ఆసక్తికరంగా రూపొందించాయి. హోల్ 1.. కాలువలో, నీటి మార్గాల్లో కొట్టుకుపోతున్న ప్లాస్టిక్ గురించి వివరిస్తుండగా, హోల్ 2 తిమింగలాలు ఎదుర్కొంటున్న ముప్పును వెల్లడించింది. మినీ గోల్ఫ్ కోర్టు పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్‌తో రూపొందించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed