ప్రజాస్వామ్యం ఓడి.. హిందూత్వం గెలిచింది

by Anukaran |   ( Updated:2020-08-05 07:05:34.0  )
ప్రజాస్వామ్యం ఓడి.. హిందూత్వం గెలిచింది
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై ఎమ్ఐఎమ్ పార్టీ ఛీప్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరు కావడాన్ని ఓవైసీ తప్పబట్టారు.

ప్రజాస్వామ్య, లౌకిక విలువలకు కట్టుబడి ఉంటానని పదవీ స్వీకారంలో చేసిన ప్రమాణాన్ని మోదీ ధిక్కరించారని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పునాది రాయి వేసిన అనంతరం తన ప్రసంగంలో భావోధ్వేగానికి లోనాయనన్న ప్రధాని వ్యాఖ్యలను ఓవైసీ ప్రస్తావిస్తూ.. ఈ దేశ పౌరుడిగా తాను కూడా అంతే తీవ్రమైన భావోధ్వేగానికి లోనయ్యానని చెప్పుకొచ్చారు. లౌకిక దేశమైన ఇండియాలో ఇలాంటివి జరగడమేంటి? పునాది రాయి వేసిన అనంతరం భావోధ్వేగానికి లోనాయ్యానని తన ప్రసంగంలో ప్రధాని చెప్పుకొచ్చారు.

‘ఈరోజు ప్రజాస్వామ్యం, లౌకికవాదం ఓడిపోయి హిందుత్వం గెలిచింది. ప్రధానమంత్రి తన ప్రమాణ స్వీకారాన్ని దిక్కరించి రామ మందిరానికి పునాది రాయి వేశారు. ఈ దేశ పౌరుడిగా, వారితో పాటే జీవిస్తున్న వాడిగా నేనూ తీవ్రమైన భావోధ్వేగానికి లోనయ్యాను. ఎందుకంటే 450 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో మసీదు ఉంది” అని ఓవైసీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed