మిలింద్ ‘కాంచన’ లుక్

by Jakkula Samataha |
మిలింద్ ‘కాంచన’ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ రోజురోజుకీ మరింత బోల్డ్‌గా కనిపిస్తున్నారు. ఈ మధ్యే గోవా బీచ్‌లో న్యూడ్‌గా కనిపించి విమర్శలు ఎదుర్కొన్నాడు. బర్త్‌‌డే స్పెషలా? లేదా మరేం అనుకున్నాడో తెలియదు కానీ.. మొత్తానికి బోల్డ్ బిహేవియర్‌తో తన మీద కేసు నమోదయ్యేలా చేసుకున్నాడు. కానీ కొందరు అఘోరాలు అలా కనిపిస్తే తప్పు లేదు కానీ.. తను చేస్తే మాత్రం తప్పొచ్చిందా అంటూ సమర్థించుకున్నాడు.

అయితే తాజా పోస్ట్‌తో మాత్రం వావ్ అనిపించాడు మిలింద్. ముక్కుకు ముక్కెర, సగం మఖానికి కుంకుమ పూసిన లుక్ అదిరిపోగా.. లవింగ్ పిక్చర్ అంటున్నారు నెటిజన్లు. నిజానికి ‘లక్ష్మి’ సినిమాలో అక్షయ్ కుమార్ లుక్ కన్నా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అని చెబుతున్నారు. ఇన్నాళ్లూ ముంబై సమీపంలోని కర్జత్‌లో స్పెండ్ చేసిన తను.. చెన్నైకి పయనం అవుతున్నట్లు చెప్పాడు. ‘ఇది హోలీ కాదని తెలుసు.. కానీ అలా యాక్ట్ చేయాల్సి వస్తే టైమ్, స్పేస్‌తో సంబంధం లేకుండా ప్రొసీడ్ అయిపోవాలంతే’ అని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed