ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికులు

by Shyam |
ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికులు
X

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ద్వారా తమకు నిత్యావసర వస్తువులు అందడం లేదని యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు అందక పోవడంతో ఆకలితో అలమటిస్తున్నామంటున్న బాధితులు.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్ పోర్ట్ కాలనీ ఫోర్త్ గ్రాండ్ వద్ద యూపీ బీహార్ రాష్ట్రాలకు చెందిన దాదాపు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఇళ్లలో బండలు, టైల్స్ వేస్తూ జీవనం సాగిస్తున్నారు. సడన్‌గా లాక్‌డౌన్ కారణంగా వీరంతా జీవనోపాధి కోల్పోయారు. ప్రభుత్వం వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు అందిస్తామని ప్రకటించినప్పటికీ.. 18 రోజులుగా ఇప్పటి వరకు కూడా తమకు ఎలాంటి నిత్యావసర వస్తువులు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఆధార్ నంబర్లు రాసుకొని పోయారు తప్ప.. ఇప్పటి దాకా నిత్యావసర వస్తువులు అందజేయలేదని చెబుతున్నారు. స్థానిక పోలీసులు ఒక పూట బోజనం అందిస్తున్నారని.. ప్రభుత్వం ఎలాగైనా తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags: Migrant workers, hungry, no food, shadhnagar, rangareddy

Advertisement

Next Story