పాలమూరులో పెరుగుతున్న వలసజీవులు!

by Shyam |
పాలమూరులో పెరుగుతున్న వలసజీవులు!
X

దిశ, మహబూబ్‌నగర్: జిల్లా నుంచి పొట్టకూటికి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు క్రమంగా ఇంటి దారి పడుతున్నారు. కరోనా వైరస్ (కొవిడ్ -19) మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో అయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో ఉపాధి కోల్పోయిన వలస జీవులకు అక్కడేం చేయాలో తోచడం లేదు. పైగా లాక్ డౌన్ పొడగింపు అయ్యేట్టు ఉందని వలస జీవులు క్రమంగా స్వగ్రామాలకు పయనమవుతున్నారు. దీంతో జిల్లాలో వలసజీవుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఇప్పటికే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారిని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. అలాగే వలసలు వచ్చిన వారు తిరిగి తమ స్వంత గ్రామాలకు వెళ్లకుండా ఉన్నచోటే ఉండాలనీ వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు వారికి ఉండేందుకు వసతితో పాటు భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రజలు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి ఇప్పట్లో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేస్తుందో లేదో అనే అనుమానం మొదలు కావడంతో చాలా మంది కూలీలు తమ, తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా తిరుగు బాట పట్టారు. ఒకవైపు అధికారులు సరిహద్దుల్లో వలసలు వచ్చే వారిని అడ్డుకుంటున్నారనే విషయం తెలుసుకున్న చాలా మంది వివిధ అడ్డదారుల్లో గ్రామాలకు చేరుకుంటున్నారు. అదే సమయంలో ఇలా వచ్చే వారి పై అధికారులు గ్రామాల్లో సర్వే చేస్తుంటే కొత్త వారు గ్రామాల్లోకి రావడం వల్ల అసలు ఎపుడు ఎవ్వరు వస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. విదేశాల నుండి వచ్చే వారి పై అధికారులు నిరంతరం నిఘా పెట్టినప్పటికీ గ్రామాల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా వుంది.

అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10వేల మంది తమ, తమ గ్రామాలకు చేరుకున్నట్లు తెలుస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 3,160 మంది ఇతర రాష్ట్రాల నుంచి గ్రామాలకు చేరుకోగా విదేశాల నుంచి 294 మంది, జోగుళాంబ గద్వాలలో 2,806 మంది, ఇతర ప్రాంతాల నుంచి 58 మంది, విదేశాల నుంచి రాగా వనపర్తిలో 1,590 మంది, ఇతర ప్రాంతాల నుంచి 55మంది విదేశాల నుంచి, నాగర్ కర్నూల్ జిల్లాలో 480మంది, ఇతర ప్రాంతాల నుంచి రాగా విదేశాల నుండి 130మంది, నారాయణపేటకు ఇతర ప్రాంతాల నుంచి 1200 మంది, రాగా విదేశాల నుంచి 36 మంది వచ్చారు. అయితే, అధికారుల లెక్కలున్నప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సంఖ్య కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. గ్రామ సర్పంచ్‌లు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని అధికారులకు తగు సమాచారం అందించాలని సూచిస్తున్న వారు మాత్రం దాని పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

Tags: migrant workers, coming back to homes, lockdown effect, covid 19

Advertisement

Next Story

Most Viewed