- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్‌తో కలిసి నడిచిన మిడ్ మానేరు బాధితులు
దిశ, సిరిసిల్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 30వ రోజుకు చేరుకుంది. ఆదివారం సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. యాత్రకు ముందు బద్దెనపల్లి వద్ద చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మిడ్ మానేరు భూ నిర్వాసితులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలపై పోరాటం చేయాలని బండి సంజయ్‌కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు.. బండి సంజయ్‌ని కలిసి తమను విధుల్లోకి తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం అందజేశారు. పాదయాత్రలో భాగంగా మదనపల్లిలో చేనేత కార్మికులను బండి సంజయ్ కలిశారు. నేత కార్మికులు ఏర్పాటు చేసిన మగ్గం నేశారు. అనంతరం నేత కార్మికులు సంజయ్‌ని సన్మానించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని బండి సంజయ్ వారికి హామీ ఇచ్చారు.