హెచ్ఆర్సీలో మిడ్ మానేరు నిర్వాసితులు ఫిర్యాదు.

by Shyam |
హెచ్ఆర్సీలో మిడ్ మానేరు నిర్వాసితులు ఫిర్యాదు.
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్:
భూ సేకరణ చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను మధ్య మానేరు ముంపు గ్రామ నిర్వాసితులు శుక్రవారం ఆశ్రయించారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన అనంతరం తంగళ్లపల్లి మండలం చీర్ల వంచ గ్రామానికి చెందిన నిర్వాసితుడు బాలరాజు మాట్లాడుతూ… తమకు రావాల్సిన పరిహారాన్ని తగ్గించి , భూ సేకరణ చట్టాలను అధికారులు ఉల్లఘించినట్లు తెలిపారు. ఏండ్లు గడుస్తున్నా తమకు పరిహారం చెల్లించలేదని తెలిపారు. అంతేకాకుండా పరిహారం కింద తమకు కేటాయించిన స్థలాలు నివాస యోగ్యంగా లేవని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన పరిహారాన్ని ఇప్పించేలా , గెజిట్ జాబితాలో బాధితులను చేర్చేలా అధికారులను ఆదేశించాలని కమిషన్‌ను బాలరాజు కోరారు.

Advertisement

Next Story

Most Viewed