దిశ ఎఫెక్ట్.. అన్నారం హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన సమస్యకు చెక్

by Shyam |
దిశ ఎఫెక్ట్.. అన్నారం హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన సమస్యకు చెక్
X

దిశ, తుంగతుర్తి: మండలంలోని అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొంత కాలంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు ఎట్టకేలకు మంగళవారం తొలగిపోయాయి. మధ్యాహ్న భోజన విషయంలో సమభావన సంఘ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడడంతో సోమవారం పాఠశాలకు రాలేదు. దీంతో ఉపాధ్యాయులే వంట చేసి వడ్డించిన దృశ్యాలు దిశ పత్రికలో రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం తుంగతుర్తి మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ పాఠశాలకు చేరుకొని సమావేశం నిర్వహించారు. వంట చేసే సమభావన సంఘం సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. ఈ మేరకు ముగ్గురు సభ్యులలో ఒకరిని తొలగించి మరొకరిని కొత్తగా నియమించారు. ముగ్గురు సభ్యులు విద్యార్థులకు వంట వండి పెట్టే విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని పేర్కొంటూ.. వారి నుంచి లిఖితపూర్వకంగా సంతకాలు తీసుకొని ఆ లెటర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపారు.

పేద విద్యార్థుల కోసం వంటమనిషిగా మారిన హెడ్‌మాస్టర్..!

Advertisement

Next Story

Most Viewed