- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ మేజ్ పజిల్ పొడవు..ఎంతో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: చిన్నారులే కాదు, చాలా మంది పెద్దవాళ్లకు కూడా పజిల్స్ సాల్వ్ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. పజిల్ పరిష్కరించే క్రమంలో మెదడు మరింత చురుగ్గా పనిచేయడంతోపాటు, జ్ఞాపకశక్తి కూడా మెరుగు పడుతుందని వైద్యులు సూచిస్తుంటారు. ఓ అమెరికన్ టీనేజర్ పజిల్ సాల్వ్ చేయడంలోనే కాదు, పజిల్ తయారు చేయడంలోనూ తనదైన ప్రతిభ చూపించింది. చేతితో అతి పొడవైన మేజ్ పజిల్ రూపొందించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
అమెరికా, మిచిగాన్‌కు చెందిన మిషెల్ నన్లేకు పజిల్స్ పరిష్కరించడమంటే భలే సరదా. మిషెల్‌కు డ్రాయింగ్ స్కిల్స్‌తోపాటు, హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే. ఈ క్రమంలోనే ‘లివింగ్ ఆర్ట్స్’ అనే కిడ్స్ ఆర్గనైజేషన్ కోసం నిధులు సేకరించాలనుకుంది. అందుకోసం తన ఆర్ట్ స్కిల్స్‌ను ఉపయోగించుకుంది. అందుకోసం ఆమె చేతితోనే అతి పొడవైన మేజ్ పజిల్‌ను రూపొందించింది. ఆ మేజ్ పొడవు 104.60 మీటర్లు ఉంది. మిషెల్ ఈ మేజ్ కోసం దాదాపు మూడు నెలలు కష్టపడింది. ఈ మేజ్‌ను గిన్నిస్ నిర్వాహకులకు సెండ్ చేసింది. ఇటీవలే మిషెల్ రూపొందించిన లార్జెస్ట్ హ్యాండ్ డ్రాన్ మేజ్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నిర్వాహకులు గుర్తించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్లో మిషెల్ మేజ్ డ్రాయింగ్ వీడియోను షేర్ చేయగా, ఆ వీడియోకు అనూహ్య స్పందన వచ్చింది.
మిషెల్‌ను నెటిజన్లు అభినందించడంతోపాటు, ఆమె సహనాన్ని ప్రశంసిస్తున్నారు. చాలామంది ఆ మేజ్ పజిల్‌ను సాల్వ్ చేయాలనుకుంటున్నారు. కానీ, సాల్వ్ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మిషెల్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పజిల్ సాల్వింగ్ వీడియోను షేర్ చేసింది. ‘అందరికీ ధన్యావాదాలు. ఈ పజిల్‌ను హైలెటర్ సాయంతో సాల్వ్ చేస్తున్నాను. ఆ ఇమేజ్‌ను స్కాన్ చేసి, డిజిటిల్ మేజ్ ఫైల్‌ను మీతో పంచుకుంటున్నాను. ఎవరైతే తమ సొంతంగా సాల్వ్ చేయాలని భావిస్తున్నారో దీన్ని చూడకుండా సాల్వ్ చేయండి. మీరు దీన్ని పరిష్కారించాలనుకుంటే మాత్రం చాలా ఫ్రీ టైమ్ కావాలి’ అని ఆమె పేర్కొంది.
1072 స్క్వేర్ ఫీట్స్ పొడవుతో రూపొందించిన మేజ్ పజిల్ రికార్డ్‌ను మిషెల్ తన మేజ్ పజిల్ (1126 స్క్వేర్ ఫీట్స్) బద్దలుకొట్టింది. కరోనా పాండమిక్ వల్ల చాలా మంది తమ ఆదాయాన్ని కోల్పోయారు. స్కూల్లో చదువుతున్న చిన్నారులకు నావంతు సాయంగా ఏదైనా చేయాలనుకున్నానని మిషెల్ తెలిపింది. అందుకే నా డ్రాయింగ్ స్కిల్స్‌ను ఉపయోగించి ఈ లార్జెస్ట్ మేజ్‌ను రూపొందించానని ఆమె తెలిపింది.