బాలుకు పాటలు విన్పిస్తున్న వైద్యులు

by Anukaran |
బాలుకు పాటలు విన్పిస్తున్న వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత రెండ్రోజుల నుంచి బాలు పరిస్థితి మరింత విషమించడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక డాక్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా నిపుణులైన పదిమంది డాక్టర్ల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. కాగా ఈ క్రమంలో తనకు పాటలు వినాలని ఉందని బాలు ఇటీవల పేపర్‌పై రాసి ఇవ్వడంతో, ఎంజీఎమ్ ఆస్పత్రి ఆరో అంతస్తులో స్పీకర్‌లు ఏర్పాటు చేసి, బాలుకు ఇష్టమైన పాటలను విన్పిస్తున్నారు.

Advertisement

Next Story