రేపటి నుంచి మెట్రో కూత

by Anukaran |   ( Updated:2020-09-06 09:50:06.0  )
రేపటి నుంచి మెట్రో కూత
X

దిశ, న్యూస్‌బ్యూరో: రేపటి నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైలు కూత పున: ప్రారంభం కానుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు మెట్రో రైలు మొదటి దశలో సోమవారం కారిడార్-1 మియాపూర్- ఎల్‌బీ‌నగర్ రూట్‌లో, మంగళవారం కారిడార్-3 నాగోల్ – రాయ్‌దుర్గం వరకు ఉ.7 గం.ల నుంచి మ. 12 గం.ల వరకు, సా.4గం.ల నుంచి రా.9 గం.ల వరకు నడువనున్నాయి. బుధవారం 9వ తేదీ నుంచి అన్ని కారిడార్లలో ఉ. 7గం.ల నుంచి రా. 9 గం.ల వరకు రైళ్ళను నడపనున్నారు. సాధారణంగా ప్రతి 5 ని.లకు ఒక రైలును నడుపుతూ.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైళ్ళ సమయాల్లో మార్పులు చేర్పులుంటాయని సంస్థ వెల్లడించింది.

గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ, మూసాపేట్, భరత్‌నగర్‌లలోని స్టేషన్లను మూసివేసినట్టు పేర్కొన్నది. మాస్కులు తప్పని సరిగా ధరించాలని, మాస్కులు మరిచి వచ్చిన వారికి చార్జీలతో మాస్కులు అందించనున్నారు. సీసీటీవీ, బోగీల్లోని ఓసీసీల ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణికులపై పర్యవేక్షణ చేపడుతారు. స్టేషన్లలోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లను ప్రవేశ ద్వారంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులను థర్మల్ పరీక్షించిన అనంతరమే స్టేషన్లోకి అనుమతించనున్నారు. ప్రతి 4గంటలకు ఒకమారు స్టేషన్లు శానిటైజ్ చేస్తారు. ట్రిప్పు ట్రిప్పుకు రైళ్ళను పరిశుభ్రం చేయనున్నారు. సంస్థ తీసుకునే అన్ని రకాల జాగ్రత్తలను వినియోగించుకుంటూ స్వీయ పరిశుభ్రతను పాటించాలని, ప్రయాణికులు తమవంతు సహాకారాన్ని సంస్థకు అందించి కొవిడ్ వ్యాప్తి నివారణలో భాగస్వాములు కావాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed