- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకనుండి మెట్రోలో ఆ సీటును ముట్టుకుంటే.. మీ జేబుకు చిల్లే!
దిశ,వెబ్ డెస్క్:మెట్రో లో రోజు ప్రయాణిస్తున్నారా..? సీటు ఖాళీగా ఉందని చెప్పి టక్కున ఏ సీటులో పడితే ఆ సీటులో కూర్చోకండి. ఏ ఎందుకు కూర్చోకూడదు..మేం కూర్చుంటాం అంటే ఫైన్ కట్టడానికి రెడీ గా ఉండండి. ఏంటి ఖాళీ సీటులో కూర్చుంటే ఫైనా? అని అనుకోకండి. కేవలం లేడీస్ సీట్లలో కూర్చుంటేనే ఫైన్ పడుతుంది. అవును ఇక నుండి మెట్రోలో మహిళలకు కేటాయించిన సీట్లలో పురుషులు కూర్చుంటే జరిమానా కట్టక తప్పదు. ఇది మెట్రోలో వచ్చిన కొత్త రూల్.
ఆ ఏముంది మనం ఒక స్టేషన్ లో ఎక్కి మరో స్టేషన్లో దిగుతాం.. అక్కడ ఎలా కట్టించుకుంటారు అనుకోకండి. ట్రైన్ దిగాక ముక్కు పిండీ మరి ఫైన్ వసూలు చేస్తారు. ఇప్పటికే పలువురు ఇలా చేయడం.. వారినుండి ఫైన్లను వసూలు చేయడం జరిగాయి కూడా. మహిళలు ఉన్నప్పుడు సీటు లో కూర్చుంటే తప్పు కానీ సీటు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుంటే తప్పేంటండి అంటూ మగమహారాజులు లబోదిబోమంటున్నారు. ఏదిఏమైనా మగవాళ్ళు ..ఇకనుండి పొరపాటున కూడా లేడీస్ సీటు లో కూర్చోడానికి ప్రయత్నించకండి..లేకపోతె మీ జేబుకు చిల్లు తప్పదు మరి.