‘మెట్రో కథలు’ పోస్టర్ రిలీజ్ చేసిన హారీష్ శంకర్

by Shyam |
‘మెట్రో కథలు’ పోస్టర్ రిలీజ్ చేసిన హారీష్ శంకర్
X

‘భవిష్యత్ అంతా.. ఓటీటీలదే’ అని ముందే గ్రహించిన అల్లు అరవింద్.. ‘ఆహా’ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫ్లామ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆహా ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు దీటుగా ఎదుగుతోంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లతో అలరిస్తున్న ఈ చానెల్.. మరో ఒరిజినల్ కంటెంట్‌తో ‘మెట్రో కథల’ను మన ముందుకు తీసుకురాబోతుంది.

‘ప‌లాస 1978’ చిత్రంతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ క‌రుణ కుమార్.. మొదటి సినిమాతోనే తన సత్తా చాటాడు. ఆ సినిమా విజయం కరుణ కుమార్‌కు మంచి ప్రోత్సాహానివ్వడమే కాదు.. అతనికి అవకాశాలను కూడా తీసుకొచ్చింది. అలా ‘ఆహా’లో నగర నేపథ్యంగా సాగే ‘మెట్రో క‌థ‌ల’ను తెర‌కెక్కిస్తున్నాడు. తెలుగు రచయిత ఖదీర్ బాబు రచించిన ‘మెట్రో కథలు’ పుస్తకంలోని నాలుగు కథలను ఆధారంగా చేసుకుని హైద‌రాబాద్‌లో నివసించే నాలుగు జంట‌ల మ‌ధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాల స‌మాహారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 14న ‘ఆహా’లో మెట్రోకథలు స్ట్రీమింగ్ కానుంది. ఈ ఒరిజినల్ కంటెంట్ ఫస్ట్ పోస్టర్‌ను ప్రముఖ ద‌ర్శకుడు హ‌రీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు. ‘ఈ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఒక పట్నం.. నాలుగు కథలు’ అంటూ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు హరీష్ శంకర్.

ఇక ఈ ‘మెట్రో కథలు’ వెబ్ సిరీస్‌‌లో అలీ రెజా, స‌న, నందినీ రాయ్‌, రామ్ మ‌ద్దుకూరి, తిరువీర్‌, న‌క్షత్ర, రాజీవ్ క‌న‌కాల‌, గాయత్రి భార్గవి త‌దిత‌రులు న‌టించారు. సినిమాటోగ్రఫీ : వెంక‌ట ప్రసాద్‌, సంగీతం : అజ‌య్ అర్సాడ‌, ఎడిట‌ర్‌ : శ్రీనివాస్ వ‌ర‌గంటి, నిర్మాత‌లు : కిర‌ణ్‌రెడ్డి మందాడి, రామ్ మ‌ద్దుకూరి, క‌థ‌ : మహ్మద్ ఖదీర్ బాబు, అడిష‌న‌ల్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ద‌ర్శక‌త్వం : క‌రుణ కుమార్‌.

Advertisement

Next Story

Most Viewed