- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీబీఎస్ బ్యాంకుకు మరింత పటిష్టత -మూడీస్
దిశ, వెబ్‌డెస్క్: అనూహ్యంగా తెరపైకి వచ్చిన లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్‌వీబీ) విలీన అంశంపై మూడీస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సమస్యాత్మక లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనం తర్వాత సింగపూర్ డీబీఎస్ బ్యాంక్ ఇండియా తన వ్యాపారాన్ని బలోపేతం చేసుకునే అవకాశముందని బుధవారం తెలిపింది. సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంక్ లిమిటెడ్ యాజమాన్యంలోని డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో ఎల్‌వీబీని విలీనం చేస్తూ ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘ఈ విలీనం కొత్త రిటైల్, చిన్న మధ్య తరహా కస్టమర్లను చేర్చుకునేందుకు వీలుంటుంది. ఈ పరిణామాలతో భారత్‌లో డీబీఎస్ బ్యాంకు మరింత పటిష్టం అవుతుంది. విలీనం తర్వాత డీబీఎస్ ఇండియా కస్టమర్ డిపాజిట్లు, నికర రుణాలు 50 శాతం నుంచి 70 శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నాము’ అని మూడీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విలీనం తర్వాత లక్ష్మీ విలాస్ బ్యాంకుకు చెందిన 500 శాఖలను, 27 శాఖలు ఉన్న డీబీఎస్‌లో కలపనుంది. డీబీఎస్ బ్యాంకు భారత్ అత్యంత ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటి అని, లక్ష్మీ విలాస్ బ్యాంక్ కొనుగోలుతో విస్తరించాలని భావిస్తున్న డీబీఎస్ వ్యూహానికి ఈ పరిస్థితులు దోహదపడతాయని మూడీస్ అభిప్రాయపడింది.