త్వరలో ఇండియాకు మెహుల్ చోక్సీ

by Shamantha N |
త్వరలో ఇండియాకు మెహుల్ చోక్సీ
X

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఫ్రాడ్ కేసు నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని కరీబియన్ కంట్రీ నుంచి త్వరలోనే ఇండియాకు తరలించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆయనను భారత్‌కు తరలించడానికి కావాల్సిన డాక్యుమెంట్లు, కేసు వివరాలతో ఓ విమానం ఢిల్లీ నుంచి డొమినికా చేరింది. ఇక ఆయనను తిరిగి స్వదేశానికి తీసుకురావడమే తరువాయి అని సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఫ్రాడ్ కేసు వెలుగులోకి రాకముందే చోక్సీ దేశం వదిలి కరీబియన్ దేశమైన ఆంటిగ్వాకు వెళ్లి తలదాచుకున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రొగ్రామ్ ద్వారా అక్కడి పౌరసత్వాన్ని పొందారు. అప్పటి నుంచి సురక్షితంగా అక్కడే నివసిస్తున్నారు.

ఇటీవలే ఆయన ఆంటిగ్వా నుంచి గర్ల్ ఫ్రెండ్‌తో పక్కనే ఉన్న డొమినికా దేశంలోకి చట్టవిరుద్ధంగా అడుగుపెట్టారు. ఆ దేశ పోలీసులు బంధించి జైలులో పెట్టారు. ఆంటిగ్వా నుంచి మరింత సురక్షిత ప్రాంతాన్ని వెతుక్కుంటూ చోక్సీ క్యూబాకు బయల్దేరినట్టు తెలిసింది. అయితే, డొమినికాలో పట్టుబడటంతో ఆయనను ఇండియాకు తీసుకురావడం సులువైందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆంటిగ్వా పౌరుడైనందును ఆ దేశం నుంచి ఇండియాకు తరలించడం న్యాయపరంగా క్లిష్టంగా ఉండేదని, డొమినికాలో దొరకడంతో భారత్‌కు తీసుకెళ్లడం సులువు అని ఆంటిగ్వా ప్రధాని గేస్టన్ బ్రౌనీ వివరించారు. అయితే, దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన కేసుపై డొమినికా దేశ న్యాయస్థానం విచారిస్తున్నది. బుధవారం వరకు అన్ని అంశాలపై స్టే విధించింది. కాబట్టి, జూన్ 2న ఇండియాకు తరలించడానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడకుంటే అధికారుల పని సులభమేనని విశ్వసనీయవర్గాల అంచనా.

Advertisement

Next Story

Most Viewed