- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ న్యూస్: నిశ్చితార్థం క్యాన్సిల్ చేసిన 'నాని' హీరోయిన్.. కారణం ఏంటి..?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహరీన్ పీర్జాదా అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్న ఈ భామ తన ఎంగేజ్ మెంట్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మార్చిలో హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుక తర్వాత మరి కొద్దీ రోజుల్లో పెళ్లి అనేలోపు ఆమె బ్రేకప్ చెప్పడం సంచలనంగా మారింది.
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021
ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ “భవ్య బిష్ణోయ్‌తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయాన్ని మేము ఇద్దరం కలిసే తీసుకున్నాం. ఈ విషయంలో ఎవరి ఫోర్స్ లేదు. మేము పెళ్లి చేసుకోవడం లేదు. నేటి నుంచి నాకు, భవ్య బిష్ణోయ్, అతడి కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇక ఈ విషయంలో నా మనసు చెప్పింది విన్నాను. నా నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు ఆమోదిస్తారని, నా ప్రైవసీకి గౌరవమిస్తారని ఆశిస్తున్నా. ఇప్పటినుంచి నా దృష్టంతా సినిమాలపైనే. అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు, ఫాలోవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమి జరిగింది అంటూ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మెహరీన్ ‘ఎఫ్3’ చిత్రంలో నటిస్తుంది.