పెళ్లి పీటలు ఎక్కబోతున్న మెహ్రీన్..

by Jakkula Samataha |
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మెహ్రీన్..
X

దిశ, సినిమా : టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా పెళ్లి పీటలు ఎక్కబోతోంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఏడడుగులు వేయనుంది. ఇది అరేంజ్ మ్యారేజ్ కాగా, లాక్‌డౌన్‌లోనే ఈ మ్యాచ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మార్చి 12న రాజస్థాన్, జైపూర్‌లోని అలీలా ఫోర్ట్‌లో నిశ్చితార్థం జరగనుండగా.. ఈ పెళ్లిపై రెండు కుటుంబాలు కూడా సంతోషంగా ఉన్నట్లు మెహ్రీన్ మదర్ పమ్మీ తెలిపింది.

కొవిడ్ కారణాల వల్ల ఎంగేజ్‌మెంట్ సెర్మనీని ప్రైవేట్‌గా కండక్ట్ చేస్తున్నామన్న పమ్మీ.. ఏయే సెలబ్రిటీలు ఫంక్షన్‌కు అటెండ్ కానున్నారనే ప్రశ్నకు ఇంకా నిర్ణయించలేదని సమాధానమిచ్చింది. నిశ్చితార్థం తర్వాతే పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తామని, అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. కాగా మెహ్రీన్ ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’ సినిమాకు కమిట్ అయింది.

Advertisement

Next Story