గ్రీన్ జోన్‌లోకి.. మేఘాలయ

by Shamantha N |
గ్రీన్ జోన్‌లోకి.. మేఘాలయ
X

షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్రంలోని పదకొండు జిల్లాలకు గాను ఒకటి మినహా మిగతా పది గ్రీన్ జోన్‌లో ఉన్నట్టు, అక్కడ నుంచి ఇతర అంతర్ జిల్లాల రవాణాకు అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి సిరిల్ గురువారం తెలిపారు. రాష్ట్రంలో నమోదైన 12 నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కేసులు రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లోనే నమోదైనట్టు చెప్పారు. కాగా, షిల్లాంగ్ ఈస్ట్ ఖాసి జిల్లాకు వస్తుంది. ఆ జిల్లా మినహా మిగతా జిల్లావాసులు తమ పనులు చేసుకోవచ్చని వివరించారు. రాష్ట్రానికి చెందిన 12,700 మంది ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ సందర్భంగా చిక్కుకున్నట్టు వివరించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం..గ్రీన్ జోన్ అంటే గత 28 రోజులుగా ఒక్క కొవిడ్ 19 కేసు కూడా నమోదు కాకపోతే ఆ ఏరియా గ్రీన్ జోన్‌లో ఉన్నట్టు అర్థం.

Tags: green zone, meghalaya state, lockdown, covid 19 effect, corona

Advertisement

Next Story