మెగా ఫ్యామిలీ లో కరోనా కలకలం.. మరో మెగా హీరోకు పాజిటివ్

by Anukaran |   ( Updated:2021-04-22 02:48:22.0  )
మెగా ఫ్యామిలీ లో కరోనా కలకలం.. మరో మెగా హీరోకు పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్: సినీ రంగానికి కరోనా జలగలా పట్టుకుంది. రోజూ ఎవరు ఒకరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన విషయం తెల్సిందే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. “నిన్న కొద్దిపాటి లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. హాస్పిటల్‌లో క్వారంటైన్ లో ఉన్నాను. త్వరలోనే కోలుకొని వస్తాను” అంటూ పోస్ట్ చేశాడు. ఇకపోతే కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’, ‘కిన్నెరసాని’ సినిమాలలో నటిస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు కోరుకొంటున్నారు.

Advertisement

Next Story