ఓ పిట్టకథకు 'చిరు' సాయం

by Shyam |
ఓ పిట్టకథకు చిరు సాయం
X

యాక్టర్ బ్రహ్మాజీ కొడుకు సంజయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘ఓ పిట్టకథ’. విశ్వంత్ దుద్దుంపూడి, నిత్యాశెట్టి లీడ్ రోల్స్ చేస్తుండగా..బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా..మార్చి 6న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది మూవీ యూనిట్. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. వెంకట లక్ష్మీ అనే పల్లెటూరి అమ్మాయి ప్రేమ కథ, ఆమె అదృశ్యం లాంటి సంఘటనలను పాయింట్‌గా తీసుకుని సినిమాను తీర్చిదిద్దారు. కాగా బ్రహ్మాజీ ప్రతీ ఈవెంట్‌లోనూ ఈ చిత్రం గురించే మాట్లాడుతున్నారు.

సినిమా ప్రమోషన్లను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్..మార్చి 1న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో జరిగే కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిన చిరు.. తెలుగు సినిమాలను ప్రోత్సహించేందుకు ముందుంటున్నాడు. ఈ మధ్య హీరో నిఖిల్ ‘అర్జున్ సురవరం’, సూపర్ స్టార్ మహేష్ బాబు’ సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై బెస్ట్ విషెస్ అందించాడు. కాగా ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇదే సెంటిమెంట్ ‘ఓ పిట్టకథ’ విషయంలోనూ వర్కౌట్ అవుతుందని భావిస్తోంది చిత్ర యూనిట్.

Advertisement

Next Story