మెగాస్టార్ చిరు 153వ చిత్రం షురూ

by Shyam |
మెగాస్టార్ చిరు 153వ చిత్రం షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్.వి.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై చిరు 153వ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మోహన్‌రాజా డైరెక్టర్. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు బుధవారం ఫిలిం నగర్ సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో జరిగాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అశ్విని దత్, డి.వి.వి.దానయ్య, నిరంజన్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు థమన్, మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాతలు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి‌తో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు, అయన అభిమానులు కోరుకునే రేంజ్‌లో ఈ సినిమా ఉంటుందని డైరెక్టర్ మోహన్‌రాజా తెలిపారు. ‘లూసీఫర్’కి ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదని, కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నామని వెల్లడించారు.

Advertisement

Next Story