కోర్టు ఆగ్రహంతో మేల్కొన్న సర్కార్.. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ షురూ

by Shyam |
Covid-19 vaccine wastage:
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైకోర్టు సూచన, ప్రజల నుంచి వస్తున్న విమర్శలతో ఎట్టకేలకు వ్యాక్సినేషన్ అంశంలో సర్కార్ మేల్కొన్నది. అర్హులందరికీ డోసులు ఇచ్చేందుకు ప్రత్యేక ప్లాన్‌ను అమలు పరుస్తోంది. దీనిలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేషన్ శిబిరాలను ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగనున్నాయి.

తొలి డ్రైవ్‌ను మంగళవారం ఖాజాగూడలో సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 78 శాతం మందికి తొలి డోసు, 38 శాతం మంది రెండో డోసును తీసుకున్నారని పేర్కొన్నారు. మిగతా వారికి వేగంగా వ్యాక్సిన్ అందించేందుకు ఈ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ డ్రైవ్‌లో టీకా వేసుకునే వారు ఎక్కువ సేపు వేయిట్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఖాజాగూడలో ఎక్కువగా మైగ్రేషన్ సిబ్బంది ఉన్నందున డ్రైవ్‌ను ఇక్కడి నుంచి ప్రారంభించామని అన్నారు.

ఈ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. వచ్చే నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 శాతం మొదటి డోస్ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే వాక్సినేషన్ తక్కువగా జరిగిన ప్రాంతాల్లో కలెక్టర్లలతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed