‘మెగా’ డైరెక్టర్ల పిక్

by Jakkula Samataha |
‘మెగా’ డైరెక్టర్ల పిక్
X

దిశ, వెబ్ డెస్క్: వివి వినాయక్ పుట్టినరోజు పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఫ్లవర్ బొకే అండ్ స్పెషల్ మెసేజ్ సెండ్ చేసి స్పెషల్ విష్ చేయగా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ స్వయంగా వినాయక్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుష్ కాగా, మెహర్ రమేష్ మరో ట్రీట్ ఇచ్చాడు.

డైరెక్టర్ బాబీ‌తో కలిసి వినాయక్ ఇంటికి వెళ్లిన మెహర్ రమేష్..ముగ్గురు కలిసి దిగిన ఫొటోను మెగా ఫ్యాన్స్ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. వినాయక్ మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘లూసిఫర్’ రిమేక్ చేస్తుండగా..మెహర్ రమేష్ చిరు హీరోగా తమిళ్ మూవీ వేదాలమ్ రీమేక్ బాధ్యతలు తీసుకున్నారు. బాబితో కూడా ఓ సినిమా ప్లాన్ చేసిన చిరు దాని గురించి ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ ఫొటో చూసిన మెగా అభిమానులు ముగ్గురు మూడు బ్లాక్ బస్టర్‌లు ఇవ్వాలని, బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed