సమన్వయం అవసరం : లోకేష్‌కుమార్

by Shyam |
సమన్వయం అవసరం : లోకేష్‌కుమార్
X

హైదరాబాద్ నగరంలో ఏడాది మొత్తం ఏదో ఒక వేడుక, పండుగలు, రాలీలు, జాతీయ, అంతర్జాతీయ సమ్మేళ నాలు, సదస్సులు,అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, ప్రముఖుల పర్యటనలు ఉంటాయని ఇందుకోసం అన్ని శాఖల మధ్య సహకారంతో ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని జిహెచ్ఎంసి కమీషనర్ డిఎస్ లోకేష్ కుమార్ అన్నారు. అందులో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసి, కొత్తగా వచ్చిన అధికారుల పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. గురువారం జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మధ్య సమన్వయం పెంపొందించడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ… 2020లో మౌళిక వసతుల అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయడానికి నిధులు సమకూర్చుకున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరంలో చేయాల్సిన అభివృద్ధి పనులు, చేయాల్సిన ఖర్చుల వివరాలు వెల్లడించారు. అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని పెంచుటకు గత మూడేండ్లకోసారి కన్వర్జెన్సీ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్టుందన్నారు. కోటి జనాభాపై బడి వున్న మన నగరాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు సమిష్టిగా కృషి చేద్దామని కోరారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతీ మాట్లాడుతూ… ప్రభుత్వ భూములు రక్షణకు జియో టాగింగ్‌తో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మార్చి నుంచే ఎగ్జామ్స్ సీజన్ మొదలవుందని తెలిపారు. రానుంది వర్షాకాలం కావున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు, హెచ్ఓడీలు, పోలీస్ అడిషనల్ సీపీలు అనిల్ కుమార(ట్రాఫిక్ ), శిఖా గోయల్(క్రైం, సిట్), డీఎస్ చౌహాన్ (లా &ఆర్డర్ ), డీసీపీలు, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed