సైలెంట్ వారియర్స్ ‘సోఫీ, విధ’

by Sujitha Rachapalli |
సైలెంట్ వారియర్స్ ‘సోఫీ, విధ’
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోషకాహారం తీసుకోవాలని, దేశీయంగా ఆట బొమ్మల తయారీతో పాటు దేశ చరిత్ర ఆధారంగా గేమ్స్ రూపొందించాలంటూ పిలుపునిచ్చారు. అంతేకాకుండా దేశవాళీ శునకాలను పెంచుకోవాలంటూ కొన్ని పేర్లు కూడా సూచించారు. మన భద్రతా బలగాలు దేశవాళీ శునకాలకే ప్రాధాన్యమిస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. 300 క్రిమినల్ కేసులను ‘రాకీ’ అనే శునకం ఛేదించిందని, అలాగే సైన్యానికి చెందిన ‘సోఫీ, విధ’ అనే రెండు శునకాలు తమ నైపుణ్యాన్ని చాటాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘సోఫీ, విధ’ సైన్యంలో ఎలాంటి సేవలు అందించాయో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

74వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో ‘విధ (లాబ్రాడర్), సోఫీ (కాకర్ స్పానియల్) అనే రెండు శునకాలు ‘కమాండేషన్ కార్డ్స్’ పొందాయి. నార్తర్న్ కమాండ్‌లో విధులు నిర్వర్తిస్తోన్న విధ.. ఇప్పటివరకు 5 మైన్లను, ఒక గ్రెనేడ్‌ను గుర్తించి వందలాది భారత జవాన్ల ప్రాణాలు కాపాడింది. ఇక సోఫీ విషయానికొస్తే.. బాంబులను గుర్తించడంలో ఎక్స్‌పర్ట్‌గా పేరొందింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.

మోదీ ఈ రెండు శునకాల పేర్లు చెప్పడంతో.. ట్విట్లర్‌లో ఇవి ట్రెండింగ్‌లో నిలిచాయి. అందరూ వీటికి సెల్యూట్ చేయడంతో పాటు వీటి సేవలను కొనియాడుతున్నారు. దేశ రక్షణకు సైనికులు త్యాగాలు చేస్తుంటే, వారి ప్రాణాలను కాపాడేందుకు ఈ శునకాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. శునకాలు విశ్వాసంలోనే కాదు, దేశ సేవలోనూ భాగమవుతున్నాయి. అందుకే ఆర్మీ డాగ్ యూనిట్‌ను ‘ద సైలెంట్ వారియర్స్’ అంటారు.

గత డిసెంబర్‌లో డాగ్స్ ట్రూప్‌కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అమర్చడంతో పాటు వాటికి ఆడియో, వీడియో సర్వైలైన్స్ సిస్టమ్‌ను కూడా జత చేశారు. దీంతో శత్రు స్థావరాలకు ఒక కిలోమీటర్ దూరం నుంచే మన సైనికుల రిసీవర్‌కు లొకేషన్ వివరాలతో పాటు శత్రువుల బలగం ఎంత ఉందో తెలిసిపోతోంది. సేఫ్ పొజిషన్ నుంచే శత్రు శిబిరాల వివరాలు తెలియడంతో మన జవాన్లు మరింత అప్రమత్త వహిస్తూ అటాక్ చేయడంలో ఆర్మీ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed