ఎనిమిదేళ్ల చిన్నారి పాటకు సంగీతాభిమానుల ‘తాలియా’

by Shyam |
ఎనిమిదేళ్ల చిన్నారి పాటకు సంగీతాభిమానుల ‘తాలియా’
X

దిశ, ఫీచర్స్ : మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌ల్లో ఇటీవల ఓ ఇంగ్లీష్ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. మరి ఆ సాంగ్‌ అమెరికన్ పాప్ సింగర్స్ లేదా కొరియన్ బీటీఎస్ బృందం కంపోజ్ చేసింది కాదు. మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి స్వయంగా లిరిక్స్ రాసి, మ్యూజిక్ అందించి రిలీజ్ చేసింది. ‘హెడ్ హెల్డ్ హై’ పేరుతో వచ్చిన ఈ పాట ప్రస్తుతం ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌ల్లో అందుబాటులో ఉంది. అంతేకాదు స్పాటిఫైలో వెయ్యికి పైగా స్ట్రీమ్‌లను అందుకుంది.

బెంగుళూరుకు చెందిన 8ఏళ్ల తాలియాజోస్ అమ్మ కడుపులో ఉండగానే సంగీతంతో అనుబంధాన్ని ఏర్పరుచుకుంది. ఈ చిన్నారి తల్లి చెరియన్ గర్భంతో ఉన్నపుడు పియానో నేర్చుకోవడంతో పాటు పాడటం ప్రాక్టీస్ చేసేది. దాంతో జోస్‌కు రెండేళ్ల వయసు రాగానే తాలియా రాగాలు తీస్తూ, పాటలు పాడటం ప్రారంభించింది. ఈ మేరకు సంగీత ప్రతిభ ఉందని గుర్తించిన తల్లిదండ్రులు ఐదేళ్ల వయసు రాగానే సంగీతంతో పాటు, పియానో లెస్సన్స్ నేర్పించారు. ఈ క్రమంలోనే తాలియా మ్యూజిక్‌పై పట్టు సాధించింది. అనుకోకుండా ఒకరోజు తాలియా తన ఆలోచనను సంగీతంగా మార్చింది. ఆ ట్యూన్ తన పియానో గురువు నోయెల్ ప్రశాంత్ బంగేరాకు వినిపించగానే ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే ఆ పాటను రికార్డ్ చేసి, జూన్‌లో విడుదల చేయగా.. తాలియాకు మంచి పేరు తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో మ్యూజిక్ వీడియోను కూడా విడుదల చేయాలని తాలియా కుటుంబం ప్రయత్నాలు చేస్తుంది.

‘మహమ్మారి ప్రారంభానికి ముందే ఈ పాట రాయగా, స్టూడియోలో రికార్డ్ చేయడానికి టైమ్ పట్టింది. లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే రికార్డ్ చేశాం. పాట చివరి మిక్సింగ్, మాస్టరింగ్ తర్వాత ఆన్‌లైన్‌లో విడుదల చేశాం. ప్రకృతితో తనకున్న అనుబంధం, అనుభవాల సారమే ఈ పాట. పిల్లల అభివృద్ధికి సంగీతం ఓ బూస్టర్ అవుతుందని నేను నమ్ముతాను. మా అమ్మాయి పాడిన పాటలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంటాను. తన ఆలోచనలతో పాటు, ఆమె ట్యూన్స్ ఎన్నో ఐప్యాడ్‌లో రికార్డ్ చేశాను. ఇక తాలియా సంగీతానికి పరిమితం కాకుండా డ్యాన్స్, స్పోర్ట్స్, డూడ్లింగ్, పెయింటింగ్‌, స్కేటింగ్‌, చదవులోనూ మంచి ప్రతిభ కనబరుస్తుంది. భవిష్యత్తులో ఏమవుతావని అడిగినపుడు మ్యూజిషియన్, ఆర్టిస్ట్, ఆర్కిటెక్ట్, అంతరిక్ష శాస్త్రవేత్త, ఫోటోగ్రాఫర్,యాక్టర్ అంటూ చెబుతూ ఉంటుంది.

– తాలియా తల్లి చెరియన్

‘అమ్మనాన్న ఇద్దరూ కూడా సంగీతాన్ని చాలా ప్రేమిస్తారు. దాంతో ఇంట్లో ఎప్పుడూ అనేక రకాలైన పాటలు వింటుంటాం. కానీ ఫ్రోజెన్ ‘లెట్ ఇట్ గో’ అంటే నాకు చాలా ఇష్టం. డిస్నీ క్లాసిక్స్ కూడా నా ఫేవరేట్. రోజురోజుకూ ఈ జాబితా పెరిగిపోతోంది. గ్రేస్ వాండర్ వాల్, ఏంజెలికా హేల్ నుంచి అన్నే-మేరీ, అడిలె, కాటి పెర్రీ, టేలర్ స్విఫ్ట్ అందర్నీ ఇష్టపడతాను. కొంతమంది స్నేహితులతో కలిసి కుక్కపిల్లల కోసం PUPPYTASTIC అనే పేరుతో సేవచేయాలని అనుకుంటున్నాను.

– తాలియా

Advertisement

Next Story