‌త్రిషకు మాఫియాతో సంబంధాలు..?

by Anukaran |   ( Updated:2020-07-28 05:41:22.0  )
‌త్రిషకు మాఫియాతో సంబంధాలు..?
X

కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్.. త్రిషను టార్గెట్ చేసింది. ఈ మిస్ చెన్నై లేడీ.. చిన్న చిన్న రోల్స్, సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఒక్కసారిగా మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్‌గా మారింది. తన పేరే త్రిష అంటూ ట్వీట్ చేసిన మీరా మిథున్.. త్రిషకు కోలీవుడ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. తన పవర్‌ను ఉపయోగించి ‘ఎన్నై అరిందాల్’ సినిమాలో తన సీన్లకు కట్ చేయించిందని తెలిపింది. నెపోటిజం, మాఫియాకు వత్తాసు పలుకుతున్న త్రిష.. ఎన్నై అరిందల్ సినిమా వచ్చి ఏడేళ్లవుతున్నా సరే తనకు అవకాశాలు లేకుండా చేస్తోందన్నారు. తాజాగా రజినీకాంత్ ‘పేట’ సినిమాలో చాన్స్ వస్తే.. ఆ ఆఫర్ కూడా వెనక్కి వెళ్లిపోయేలా చేసిందని ఆరోపించింది. త్రిష నిజరూపం చూపిస్తూ త్వరలో ఓ వీడియో కూడా రిలీజ్ చేస్తానని ప్రకటించింది. దీంతో ఈ విషయం కాస్తా టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయిపోయింది. మరి దీనిపై త్రిష ఎలా స్పందిస్తుందో? ఎలాంటి కౌంటర్ ఇస్తుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం త్రిష మణిరత్నం ‘పొన్నాయిన్ సెల్వన్’ చిత్రంతో పాటు మరో రెండు తమిళ సినిమాల్లోనూ నటిస్తుందని సమాచారం. 15 ఏళ్లకు పైగా కోలీవుడ్‌ను ఏలుతున్న త్రిషకు నిజంగానే కోలీవుడ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.

https://twitter.com/meera_mitun/status/1287809087372005378?s=19

Advertisement

Next Story

Most Viewed