ట్రంప్‌ ఆరోపణలకు లైవ్‌లోనే వివరణ

by vinod kumar |
ట్రంప్‌ ఆరోపణలకు లైవ్‌లోనే వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైవ్ టెలికాస్ట్‌ను ఆ దేశ ప్రధాన మీడియా సంస్థలు మధ్యలోనే కట్ చేశాయి. యాంకర్‌లు మధ్యలోనే కలుగజేసుకుని ట్రంప్ ఆరోపణలకు వివరణనిచ్చారు. అమెరికాలో మెజార్టీ వీక్షకులున్న ఏబీసీ, సీబీఎస్, ఎన్‌బీసీ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్‌ల ప్రసారాలను సాయంత్రాల్లో ఎక్కువ మంది చూస్తుంటారు. సరిగ్గా ఆ సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఓటింగ్‌లో మోసం జరిగిందన్న ఆరోపణలే మళ్లీ మళ్లీ చేశారు.

దీంతో ఎన్‌బీసీ యాంకర్ మధ్యలో కలుగుచేసుకుని ‘మేం ఇక్కడ కలుగజేసుకోవాల్సి ఉన్నది. ఓటింగ్‌లో మోసం సహా అధ్యక్షుడు పలు తప్పుడు స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. వీటికి ఆధరాల్లేవు’ అని వివరించారు. ఏబీసీ యాంకర్ మధ్యలో జోక్యం చేసుకుని ఈ ప్రసంగంలో ఎన్నో వివరణలు ఇవ్వాల్సి ఉన్నదని, అనేక విషయాల నిజానిజాలను పరిశీలించాల్సి ఉన్నదని తెలిపారు. ట్రంప్ తప్పులను సీబీఎస్ కరస్పాండెంట్ వరుసగా వివరించారు. గురువారం ఎంఎస్ఎన్‌బీసీ చానెల్ ట్రంప్ ప్రసంగం మొదలైన 35 సెకండ్ల నుంచే కోతలు పెట్టింది.

Next Story