- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్వారంటైన్ జర్నలిస్టులకు ఆర్థిక సాయం
దిశ, ఖమ్మం :
ఖమ్మంలో కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న జర్నలిస్టులకు మీడియా అకాడమీ ఆర్థిక సాయం మంజూరు చేసిందని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ తెలిపారు. ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఆరుగురికి రూ. 60 వేలను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో తొలి కరోనా కేసు వెలుగు చూసిన సందర్భంలో అతనికి సన్నిహితంగా మెలిగిన జర్నలిస్టులను వైద్యులు క్వారంటైన్ చేసిన విషయం విదితమే. కరోనా వ్యాధి బారిన పడుతున్న జర్నలిస్టుల సంఖ్య పెరుగుతుండటంతో.. మీడియా అకాడమీ స్పందించి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు కరోనా పాజిటివ్ వస్తే రూ. 20 వేలు, క్వారంటైన్ అయితే 10 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తోంది. అందులో భాగంగా జిల్లాకు చెందిన ఆరుగురు క్వారంటైన్ జర్నలిస్టులకు ఆర్థిక సాయం వచ్చిందని ఆదినారాయణ, ఇస్మాయిల్ తెలిపారు.