జిల్లాను ఫస్ట్ ప్లేస్‌లో నిలిపిన డీఐఈవో మృతి

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనాతో పోరాడుతూ మేడ్చల్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి (డీఐఈఓ) ఆర్‌.పి.భాస్కర్‌ మరణించారు. ఈ నెల 5న జ్వరం రావటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కొద్దిరోజులుగా రెండు ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. పరిస్థితి విషమించటంతో కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారు. 2018లో మేడ్చల్‌ జిల్లా డీఐఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు.

Advertisement