మేడ్చల్‌లో సివిల్ సప్లై గోదాంల తనిఖీ

by Shyam |   ( Updated:2020-04-07 06:36:42.0  )
మేడ్చల్‌లో సివిల్ సప్లై గోదాంల తనిఖీ
X

దిశ, మేడ్చల్: జిల్లాలోని కీసర, కిష్టాపూర్ గ్రామాల్లోని సివిల్ సప్లై గోదాంలను కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2.50 లక్షల రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసినట్టు తెలిపారు. లబ్దిదారులు రేషన్ దుకాణాల ముందు సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం గోదాంలలోని హమాలీలతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వారికి స్వయంగా శానిటైజర్ వేసి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంతకుముందు ఎన్ని రేషన్ దుకాణాలకు బియ్యం వెళ్లాయి?, ఇంకా ఎన్ని షాపులకు వెళ్లాలో తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ విద్యాసాగర్, సివిల్ సప్లై డీఎం రాజేందర్, మేడ్చల్ తహసీల్దార్ సురేందర్, సంబంధిత అధికారులు ఉన్నారు.

Tags: medchal, collector vasam venkateshwarlu, civil supply warehousings, corona, virus, mro surendhar,

Advertisement

Next Story

Most Viewed