మేడారం.. భక్తజన గుడారం

by Shamantha N |
మేడారం.. భక్తజన గుడారం
X

సియాలోనే అతిపెద్ద మహాజాతర మేడారం. దీనికి గుడి లేదు, గోపురం ఉండదు, అభిషేకాలు, వేదమంత్రాలు వినపడవు. అయినా కోట్లాదిమంది భక్తుల ఆరాధ్యదైవంగా కొలిచే సమ్మక్క సారలమ్మల మహాజాతర ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. నమ్మకానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఆదివాసీలు, గిరిజనులు ఆ తల్లీబిడ్డలను కొలుస్తారు. కేవలం నాలుగు రోజుల్లోనే కోటి యాభైలక్షల మంది దర్శించుకునే మహా పుణ్యక్షేత్రం. దేశం నలుమూలల నుంచి భక్తజనం తరలివచ్చే ఆదివాసీ కుంభమేళా. వీరత్వం, ధీరత్వం కలిగిన తల్లీబిడ్డలను పచ్చని అడవుల్లో కొలువైన వనదేవతల క్షేత్రం. సమ్మక్క-సారలమ్మల మహాజాతరను చూసి తరించిపోతారు. ఎక్కడో మారుమూలన ఉండే గ్రామా వీరవనితల పోరాట స్ఫూర్తి దేశం మొత్తం తెలిసింది.

పోటెత్తుతున్న భక్తులు

ములుగు జిల్లా మేడారంలో జన జాతర మొదలైంది. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో వనాలన్నీ జనమయమయ్యాయి. సమ్మక్క, సారలమ్మకు ప్రీతిపాత్రమైన బెల్లంను బంగారంగా సమర్పించేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. రెండేళ్లకోసారి జరిగే ఈ మేడారంలోని కీకారణ్యంలో కొలువైన వనదేవతల దర్శనానికి భక్తకోటి తరలుతున్నారు. ఒకప్పుడు కేవలం ఆదివాసీలకే పరిమితమైన ఈ జాతర ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. ప్రపంచం నలుమూలలా ఉండే తెలుగువారు జాతర కోసం వస్తున్నారు. ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు, జీపులు, బస్సులు‌ ఒకటేమిటి వేలాదిగా వాహనాలు జాతరకు తరలుతున్నాయి.

జంపన్నవాగులో పూనకాలు

మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో స్నానమాచరించడం ఆనవాయితీ. భక్తుల పూనకాలతో జంపన్నవాగు హోరెత్తుతోంది. లక్షలాదిగా భక్తులు తలనీలాలు సమర్పించుకుని వాగులో పుణ్య స్నానాలు ఆచరించి ఆ‌ తల్లీబిడ్డల దర్శనం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

కట్టుదిట్టమైన భద్రత

రెండేళ్లకు ఒకసారి జరిగే మాఘశిద్య పౌఢ్యమి రోజు ఈ జాతరను నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు దాదాపు కోటిమంది భక్తులు వస్తారని అంచనా. అందుకే భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్నిరకాల ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. తాగునీరు నుంచి వైద్యం వరకూ అన్నింటికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అటు పోలీసులు కూడా భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దాదాపు 10 వేలమంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 350 సీసీ కెమెరాలు, షీ టీమ్స్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. రేపు మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెలను సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై దర్శించుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed