నేషనల్ రూరల్ కబడ్డీ ఛాంపియన్‌గా మెదక్ జట్టు

by Shyam |
నేషనల్ రూరల్ కబడ్డీ ఛాంపియన్‌గా మెదక్ జట్టు
X

దిశ, రామాయంపేట : నేషనల్ రూరల్ కబడ్డీ ఈవెంట్స్ లో మెదక్ జిల్లా జట్టు ఛాంపియన్ నిలిచింది. ఈ నెల 3,4,5 తేదీలలో మహారాష్ట్ర లోని ప్రీతి సుధాజి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మహారాష్ట్ర రూరల్ గేమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ లో మెదక్ టీం ఛాంపియన్ గా నిలిచినట్లు కెప్టెన్ రాకేష్ తెలిపారు. వారికి హర్యానా నేషనల్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కోచ్ ప్రదీప్ కత్రియా చేతుల మీదుగా మెమెంటో అందించారు. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ ఆడే మేము ఈ రోజు నేషనల్ ఛాంపియన్ లుగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఛాంపియన్ లుగా నిలిచిన కబడ్డీ టీం లో నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు ఉండటం గమనార్హం. వివిధ కబడ్డీ టోర్నీలలో పరిచయమై ఫ్రెండ్స్‌గా మారిన యువకులు ఒక టీం గా ఏర్పడి నేషనల్ ఛాంపియన్ లుగా నిలిచారు.

రెజ్లింగ్‌లో సిల్వర్ మెడల్, కబడ్డీలో ఛాంపియన్

నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామానికి చెందిన బండారి.వంశీ గౌడ్ నేషనల్ లెవల్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.నేషనల్ రూరల్ కబడ్డీ ఛాంపియన్ టీం లో ఇతను కూడా ఒక ఆటగాడు.

Advertisement

Next Story

Most Viewed