- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వలస కూలీకి అంత్య క్రియలు చేసిన ఎండీఆర్ ఫౌండేషన్
దిశ, పటాన్ చెరు: బతుకుతెరవుకోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించి ఓ ఫౌడేషన్ దాతృత్వం చాటుకుంది. నెల రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఓ వ్యక్తి బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. హైదరాబాద్‌లోని పటాన్ చెరు నియోజకవర్గం గడ్డపోతారంలో గల ఓ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి బలరాం(31) తన భార్యతో ఫోన్ లో గొడవపడి మద్యం మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా రుబారపూర్ గ్రామానికి చెందిన వారి కుటుంబ సభ్యులను మృతదేహాన్ని తీసుకు వెళ్లాలని స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు. దీనితో వారి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకువచ్చే ఆర్థిక స్తోమత లేదని, స్థానికంగానే మృతదేహాన్ని అంత్యక్రియలు జరపాలని పోలీసులకు సూచించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించి, ఎండీఆర్ ఫౌండేషన్ ను అంత్యక్రియలు నిర్మించాలని పోలీసులు కోరారు. ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు ఆర్థిక సహకారంతో, ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు.