- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020/21 సీజన్ చివరి అంకానికి చేరుకున్నది. ఆదివారంతో లీగ్ దశలోని మ్యాచ్‌లు అన్నీ ముగిశాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ముంబయి సిటీ క్లబ్ లీగ్ విన్నర్‌గా ట్రోఫీ గెలుచుకున్నది. ముంబయి సిటీ, ఏటీకే మోహన్ బగాన్ క్లబ్స్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబయి సిటీ 2-0తో గెలిచి లీగ్ విన్నర్‌గా అవతరించింది. మోహన్‌బగాన్ క్లబ్ కూడా 40 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే ఈ సీజన్‌లో ముంబయి సిటీ క్లబ్ రెండు సార్లు మోహన్‌బగాన్‌పై గెలవడంతో ముంబయికే షీల్డు దక్కింది. ఐఎస్ఎల్ లీగ్ విన్నర్‌గా అవతరించడంతో ముంబయి సిటీకి ఏఎఫ్‌సీ చాంపియన్స్ లీగ్ బెర్తు ఖరారయ్యింది. ఇక ఐఎస్ఎల్ సెమీ ఫైనల్స్‌కు నాలుగు జట్లు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో టాప్ 4 క్లబ్స్ అయిన ముంబయి సిటీ, ఏటీకే మోహన్‌బగాన్, నార్త్ఈస్ట్ యునైటెడ్ క్లబ్, గోవా ఎఫ్‌సీ సెమీస్‌లో తలపడనున్నాయి.
ఇలా సెమీస్‌కు..
కరోనా కారణంగా ఐఎస్ఎల్‌ను గోవాలోని ఫటోర్డా, జీఎంసీ, తిలక్ మైదాన్ స్టేడియంలకు పరిమితం చేశారు. పూర్తి బయోబబుల్ వాతావరణంలో 11 జట్లు 2020/21 సీజన్‌లో పాల్గొన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ మోహన్‌బగాన్, గత సీజన్ లీగ్ విజేత గోవా నిలకడగా రాణించాయి. గోవా ఈ సీజన్‌లో కాస్త వెనుకబడిందనే చెప్పవచ్చు. హైదరాబాద్ క్లబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంతో గోవా టాప్ 4లో చోటు దక్కించుకుంది. లీగ్ చివరి దశలో హైదరాబాద్ ఎక్కువ మ్యాచ్‌లు డ్రా చేసుకోవడం ఆ జట్టు సెమీస్ ఆశలను దెబ్బతీసింది. ముంబయి సిటీ, ఏటీకే మోహన్ బగాన్ జట్లు సీజన్ ప్రారంభం నుంచి పాయింట్ల పట్టికలో దూసుకొని పోయాయి. నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు అండర్ డాగ్స్‌లా ఎవరి అంచనాలు అందకుండా రాణించింది. ముఖ్యంగా సీజన్ రెండో అర్దభాగంలో విజయాలు ఎక్కువగా తమ ఖాతాలో వేసుకొని సెమీస్‌కు సగర్వంగా చేరింది. గోవాలోని రెండు లెగ్స్‌లో నాలుగు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఫార్మాట్ ప్రకారం నాలుగు సెమీస్..
ఐఎస్ఎల్ ప్రారంభం నుంచి ఉన్న ఫార్మాట్‌లోనే ఈ సారి కూడా సెమీస్ నిర్వహించనున్నారు. గతంలో సెమీస్ చేరిన జట్లు హోం గ్రౌండ్‌లో ఒకటి, ప్రత్యర్థి గ్రౌండ్‌లో మరొకటి కలిపి ఒక్కో జట్టు రెండు సెమీస్ ఆడేవి. ఇలా సెమీస్ చేరిన నాలుగు జట్లు కలిపి నాలుగు సెమీఫైనల్స్ ఆడేవి. ఈ సారి కరోనా కారణంగా న్యూట్రల్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. దీంతో ఫార్మాట్‌లో మార్పులు ఏమైనా ఉంటాయని అందరూ భావించారు. కానీ గత ఫార్మాట్ ప్రకారమే నాలుగు సెమీస్ నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ముంబయి సిటీ, ఫుట్‌బాల్ క్లబ్ గోవా రెండు సెమీస్‌లో తలపడతాయి, ఏటీకే మోహన్‌బగాన్, నార్త్ఈస్ట్ యునైటెడ్ మరో రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఆడతాయి. వీటిలో గెలుపు ఆధారంగా ఫైనల్స్ బెర్తులు ఖాయం చేస్తారు.
సెమీస్ షెడ్యూల్..
లెగ్ 1
మార్చి 5 – ఎఫ్‌సీ గోవా Vs ముంబయి సిటీ ఎఫ్‌సీ
మార్చి 6 – నార్త్ఈస్ట్ యునైటెడ్ Vs ఏటీకే మోహన్‌బగాన్
లెగ్ 2
మార్చి 8 – ఎఫ్‌సీ గోవా Vs ముంబయి సిటీ ఎఫ్‌సీ
మార్చి 9 – నార్త్ఈస్ట్ యునైటెడ్ Vs ఏటీకే మోహన్‌బగాన్
ఫైనల్
మార్చి 13
మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.
పాయింట్ల పట్టిక
ముంబయి సిటీ 40
ఏటీకే మోహన్‌బగాన్ 40
నార్త్ఈస్ట్ యునైటెడ్ 33
గోవా 31
హైదరాబాద్ 29
జంషెడ్‌పూర్ 27
బెంగళూరు 22
చెన్నయిన్ 20
ఈస్ట్‌బెంగాల్ 17
కేరళ బ్లాస్టర్స్ 17
ఒడిషా 12