- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pochampalli Srinivas Reddy : ముగిసిన పోచంపల్లి విచారణ

దిశ, వెబ్ డెస్క్ : ఫాంహౌసు(Farm House Case)లో కోడిపందేలు, క్యాసినో నిర్వహిస్తునారన్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(Pochampalli Srinivas Reddy)ని నేడు పోలీసులు విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు అధికారులు పోచంపల్లిని విచారించినట్టు సమాచారం. కాగా వెంట వచ్చిన పోచంపల్లి న్యాయవాదిని, ఫాంహౌస్ లీజుకు తీసుకున్న వ్యక్తిని లోపలికి అనుమతించలేదు పోలీసులు. విచారణ అనంతరం బయటకు వచ్చిన పోచంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పినట్టు తెలిపారు.
ఫాంహౌస్ లీజు వివరాలు అడిగితే ఇచ్చానని అన్నారు. ఇది కేవలం రాజకీయ కుట్ర అని పోచంపల్లి పేర్కొన్నారు. గతనెలలో మొయినాబాద్ లోని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫాంహౌసులో కోడి పందేలు, క్యాసినో నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 61 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా పోచంపల్లికి నోటీసులు పంపించగా.. తొలుత న్యాయవాదిని పంపించారు. అనంతరం వ్యక్తిగతంగా హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపగా, నేడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.