Beauty: ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. బ్యూటిఫుల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

by sudharani |
Beauty: ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. బ్యూటిఫుల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్
X

దిశ, సినిమా: డైరెక్టర్ మారుతి (Maruti) ప్రజెంటర్‌గా తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘బ్యూటీ’ (Beauty). ఇందులో అంకిత్ కొయ్య (Ankit Koya), విశాఖ ధిమన్ (Visakha Dhiman) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ (Zee Studios) సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే’ ఫేమ్ వర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మించిన ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ (First look), మోషన్ పోస్టర్ (Motion poste) అందరిలోనూ మంచి ఇంపాక్ట్‌(Good impact)ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే నేడు హోలీ సందర్భంగా కలర్ ఫుల్ పోస్టర్‌(Colorful poster)ను రిలీజ్ చేస్తూ.. మరో అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ‘మరన్ని రాబోతున్నాయి.. రెడీగా ఉండండి.. ఫస్ట్ సింగిల్ కమింగ్ సూన్’ అంటూ విడుదల చేసిన పోస్టర్‌లో హీరో అండ్ హీరోయిన్ క్యూట్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed