Viral video: స్విమ్మింగ్ పూల్‌లో ఆ పని చేస్తున్నారా..? ఇలా దొరికిపోతారు జాగ్రత్త!

by Javid Pasha |   ( Updated:2025-03-14 14:51:23.0  )
Viral video: స్విమ్మింగ్ పూల్‌లో ఆ పని చేస్తున్నారా..? ఇలా దొరికిపోతారు జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : సమ్మర్‌లో ఏ స్విమ్మింగ్ పూల్‌కో వెళ్లి సరదా.. సరదాగా ఈత కొట్టేద్దామనుకుంటున్నారా? చాలా మందికి ఈ విధమైన ఆసక్తి ఉండే ఉంటుంది. కానీ ఒక విషయం తెలిస్తే మాత్రం కాస్త ముందూ వెనుక ఆలోచిస్తారు! డైలీ స్విమ్మింగ్ చేసేవారు కూడా ఇక నుంచి వెళ్దామా వద్దా? అనే సందేహంతో, సందిగ్ధంతో సతమతం అవుతారు. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా? మరేం లేదు కానీ.. స్విమ్మింగ్ (Swimming) చేస్తున్నప్పుడు అత్యవసరం ఏర్పడో, అలవాటు కొద్దో కొందరు మూత్ర విసర్జన కూడా చేస్తారట. ఇది వినగానే చిన్న పిల్లలు అలా చేస్తుండవచ్చు అనుకునేరు. పెద్దలు కూడా చేస్తారట! అయితే ఇక నుంచి అలాంటి వారిని ఎలా కనిపిపెట్టవచ్చో తెలియజేసే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ సమాచారం ప్రకారం.. స్విమ్మింగ్ పూల్‌లో ఓ విధమైన రసాయనం (పేరు లేదు) ముందుగానే కలపడం ద్వారా లేదా స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు అందులో వేయడం ద్వారా ఎవరు మూత్ర విసర్జన చేస్తున్నారో తెలిసిపోతుంది. ఎందుకంటే ఎవరైనా మూత్ర విసర్జన చేస్తుంటే(While urinating).. వారి మూత్రం నీళ్లల్లో ఎక్కడెక్కిడికి విస్తరిస్తుందో అక్కడక్కడ నీరు మొత్తం ఎరుపు లేదా పర్పపల్ రంగులోకి మారుతుంది. దీనిని బట్టి స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఎవరు మూత్ర విసర్జన చేస్తున్నారనేది నిర్వాహకులు ఈజీగా కనిపెట్టే అవకాశం ఉందని వైరల్ వీడియోలో చెప్పుకొచ్చారు. అందుకే స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లేవారు జరభద్రం.. అక్కడ ఆ పనిమాత్రం చేయకండి అంటున్నారు పలువురు.

ప్రతీ ఐదుగురిలో ఒకరు అంతే..

వాటర్ క్వాలిటీ అండ్ హెల్త్ కౌన్సిల్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం కూడా ప్రతీ ఐదుగురు పెద్దలలో ఒకరు పూల్‌లో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేస్తామని అంగీకరించారు. అట్లనే ప్రతీ 10 మందిలో ఒకరు కొలనులో ఈతకోసం వచ్చే ముందు మురికి శరీరంతో, చెమట వాసనతో ఉంటున్నారు. యూఎస్ఏ స్విమ్మింగ్ జాతీయ జట్టు (USA Swimming national team) మాజీ మెంబర్ కార్లీ గీహర్ (Carly Geihr) ప్రకారం కూడా దాదాపు వందశాతం ఎలైట్ కాంపిటీటివ్ ఈతగాళ్లు స్విమ్మింగ్ సమయంలో మూత్ర విసర్జన చేస్తామని అంగీకరించినట్లు ఓ ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అందుకే జర జాగ్రత్త!

ఇదీ.. సంగతి !

కొలనులో(Swimming pool) స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు గుర్తించడానికి నీటిలో కలపగలిగే రసాయనం నిజంగానే ఉందా? ఆ సమయంలో మూత్ర విసర్జన(urination) చేస్తున్నవారిని కనిపెట్టవచ్చా? అంటే అలాంటి చాన్స్ లేదంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి కెమికల్ ఉందనేది ప్రచారంలో ఉన్న ఒక అపోహ(misconception)మాత్రమేనని చెబుతున్నారు. అయితే పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు పూల్‌లో మూత్ర విసర్జన (urination) చేయకుండా ఆపే ఉద్దేశంతో ఈ ప్రచారం పుట్టుకొచ్చిందట. పేరెంట్స్ తమ పిల్లలకు అలా చెప్పడం ద్వారా ఈ భయాన్ని పెట్టేరట. క్రమంగా అది పిల్లలకు, పెద్దలకు వర్తించేలా ప్రచారమైపోయింది. నిజం కాకపోయినా ఇదీ ఒకింత మంచిదే అంటున్నారు పలువురు. అయితే అపోహల సంగతి ఎలా ఉన్నా పరిశుభ్రతను దృష్ట్యా కొలనులో మూత్ర విసర్జన మంచిది కాదని గుర్తుంచుకోండి!

Read Also..పెళ్లి కావాలంటే అబ్బాయిలు ఆ పార్ట్ కట్ చేసుకోవాల్సిందే.. షాక్ ఇస్తున్న వింత ఆచారం.. కానీ అది లేకుండా ఎలాగండి.....

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story