- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హోలీ సంబరాల్లో పాత్రికేయులు..

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులు ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు. ఆర్మూర్ లోని మార్కెట్ యార్డ్ లో జర్నలిస్టులు ఒకరికొకరు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్, పీసీసీ మాజీ కార్యదర్శి, న్యాయవాది ఖాందేశ్ శ్రీనివాస్, సీఐ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, మాజీ కౌన్సిలర్ సంగీత రవి గౌడ్, వరలక్ష్మి లింబాద్రి గౌడ్, గంగా మోహన్ చక్రులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సవాల మధ్య హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సాత్ పుతె శ్రీనివాస్, గణేష్ గౌడ్, విన్సెంట్, శ్రావణ్, మహిపాల్, వినోద్, చరణ్ గౌడ్, షికారి శ్రీనివాస్, గట్టడి అశోక్, ఘటడి రాజ్ కుమార్, జంగం శ్రీనివాస్, సామ సురేష్, గటడి అరుణ్, విట్టల్, సాయి, బారడ్ గణేష్, వెంకటేశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.